పెనుగొండ: ప్రజలపై విద్యుత్ చార్జీల భారాలను ఉప సంహరించండి: సిఐటియు
ప్రజలపై విద్యుత్ చార్జీల భారాలను ఉప సంహరించాలని సీఐటీయూ పెనుగొండ మండల కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ టిడిపి కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానికి విరుద్ధంగా చార్జీలను 44 శాతం పెంచడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారన్నారని అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు.