గోరంట్ల మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం మంత్రి సవిత మండల పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి సవిత మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం తీసుకుంటే రూ 5 లక్షల ప్రమాద బీమాతో పాటు కుటుంబ సభ్యులకు విద్య, వైద్య, ఉపాధి కోసం సాయం అందించనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొల్లకుంట అంజనప్ప, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.