రొళ్ల మండలంలోని లక్ష్మీ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలను మంగళవారం మండల విద్యాధికారి శ్రీధర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తెలుగు రికార్డులను పరిశీలించారు. సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ 2, అపార్ ప్రక్రియను పరిశీలించి ఉపాధ్యాయుల పాఠ్య ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల పాఠ్య పుస్తకాలను, హాజరు పట్టిని, పాఠశాల రికార్డులను పరిశీలించారు.