కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా శనివారం కళ్యాణదుర్గం ప్రాంతంలో ఖరీఫ్ పంటల సాగును పరిశీలించారు. అనంతరం రైతులకు ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన వేరుశెనగ, ఆముదం, కంది పంటల సాగులో చీడపీడలు నివారణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు.