రోడ్డు నిర్మాణ పనులను డిసెంబర్ లోపల పూర్తిచేసి మంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం కదిరి నుంచి రాయచోటి రోడ్డు పనుల్లో భాగంగ కాంట్రాక్టర్ కృష్ణ మోహన్ నాయుడు కొత్తగా తెచ్చిన 4 జేసిబి హిటచి లను గాండ్లపెంట మండలం తాల కాలవ గ్రామంలో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనులను డిసెంబర్ లోపల పూర్తి చేస్తామన్నారు.