గుత్తి పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో శనివారం సీపీఎం నాయకులు, కార్యకర్తలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గం సభ్యురాలు సావిత్రి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తామన్నారు. ఉద్యమానికి అవసరమైన కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీలో కూడా మతలబు ఉందన్నారు. అన్నింటినీ వెలికి తీస్తామన్నారు.