గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో గురువారం ఉదయం శానిటేషన్ పనులను మున్సిపల్ కమిషనర్ నయీం అహ్మద్ పరిశీలించారు. అనంతరం పలు కిరాణా దుకాణాలు, హోటల్స్‌ను తనిఖీ చేశారు. పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ కవర్లను వినియోగించరాదని, ఒకవేళ వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.