ముదిగుబ్బ మండలంలోని రామస్వామి తాండా వాసుల సమస్యకు ముదిగుబ్బ మండల ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్, ధర్మవరం ఆర్డీఓ మహేష్ తదితర అధికారులు శుక్రవారం స్పందించారు. ముదిగుబ్బ మండల కేంద్రం నుంచి పుట్టపర్తికి వెళ్లే రహదారి విస్తరణలో భాగంగా స్మశానం కోల్పోయామని, స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని గతంలో తాండా వాసులు కోరగా త్వరలో స్థలం కేటాయిస్తామని ఎంపీపీ, ఆర్డీఓ, మండల అధికారులు స్పందించి హామీ ఇచ్చారు.