ధర్మవరం మండలం రూరల్ పరిధిలోని నడిమి గడ్డపల్లి బలిజ మడి తండా గ్రామానికి చెందిన అప్ప నాయక్ సాగు చేసిన ద్రాక్ష పంట వర్షానికి దెబ్బతిని పూర్తి స్థాయిలో నేల మట్టమైనది. ఈ విషయం తెలిసి ధర్మవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ మంగళవారం ద్రాక్ష తోటను పరిశీలించి ఆర్థిక సహాయం రూ. 50 వేలు అందజేశారు. హార్టికల్చర్ అధికారులతో మాట్లాడి పంట నష్టపరిహారం వచ్చేలా చూస్తామని రైతుకు హామీ ఇచ్చారు.