సమస్యలు పరిష్కరించాలని సత్యసాయి నీటి సరఫరా పథకం కార్మికులు 22 రోజులుగా జిల్లా వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టారు. అనంతపురం పట్టణంలోని సత్యసాయి బోర్డు కార్యాలయంలో గురువారం అధికారులు జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు ఉపేంద్ర కుమార్, గోవిందు తెలిపారు. సమ్మెకు సహకరించిన ప్రజా సంఘాల నాయకులకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.