పరిశ్రమలు జిల్లా ఆర్థిక ప్రగతికి ఆయువు పట్టు అని, జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్ఠం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో 51వ జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. జిల్లాలో ఉపాధి అవకాశాలు సృష్టించే తయారీ, సేవారంగ పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించాలన్నారు.