శాసనసభలో కూటమి ప్రభుత్వం, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ స్వర్ణాంధ్ర సాధనకు బాటలు వేస్తుందని పద్మశాలి సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పోతుల లక్ష్మి నరసింహులు అభివర్ణించారు. బడ్జెట్ పై సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోతుల లక్ష్మి నరసింహులు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ ప్రయోజనం పొందే బడ్జెట్ ను ప్రకటించడం గమనార్హం అన్నారు.