అనంతపురం: ఉద్యోగ, కార్మిక సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ

78பார்த்தது
అనంతపురం: ఉద్యోగ, కార్మిక సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ
రాష్ట్ర ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి శనివారం డిమాండ్ చేశారు. అనంతపురంలోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ లో ఏఐటీయూసీ నగర సమితి సమావేశం నిర్వహించారు. కేంద్రం కార్మిక లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలను కొనసాగించాలన్నారు. కనీస వేతనంగా రూ. 26 వేలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రమేశ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி