పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రులదే కీలక పాత్ర అని జిల్లా ఎస్పీ జగదీశ్ దంపతులు అభిప్రాయాన్ని వెల్లడించారు. పోలీసు కాన్ఫరెన్స్ హాలులో రక్షక్ ప్రీ ప్రైమరీ స్కూలు పిల్లల నడుమ ఘనంగా బాలల దినోత్సవం గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎస్పీతో పాటు సతీమణి హేమ పాల్గొని ప్రసంగించారు. పిల్లల భవిష్యత్తు నిర్దేశంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమని, అభివృద్ధి, శ్రేయస్సు, భద్రత చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.