రాష్ట్ర ప్రభుత్వం ఏపీ బోయ కార్పొరేషన్ లో 15 మందిని డైరెక్టర్లుగా నియమిస్తూ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా అనంతపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు పుట్టా లక్ష్మీనరసింహమూర్తికి ఏపీ బోయ కార్పొరేషన్ డైరెక్టర్ గా చోటు దక్కింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన అవకాశాన్ని కల్పించిన సీఎం చంద్రబాబుకు, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు రుణపడి ఉంటానని తెలిపారు.