ఈ నెల 4 నుంచి 16వ తేదీ వరకు చెన్నైలో నిర్వహించే హాకీ ఇండియా సీనియర్ మెన్ నేషనల్ ఛాంపియన్ షిప్ కు ఏపీ తరఫున అనంతపురం జిల్లాకు చెందిన జస్వంత్, చంద్రమౌళి ఎంపికయ్యారు. ఆదివారం అనంతపురంలో జిల్లా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్. అనిల్ కుమార్ మాట్లాడారు. నేషనల్ చాంపియన్ షిప్ కు జిల్లా క్రీడాకారులు ఎంపికవ్వడం అభినందనీయం అన్నారు.