అనంతపురంలోని ఎస్సీ మున్సిపల్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యుడు కే. హర్షవర్ధన్ పై కొందరు వ్యక్తిగతంగా చేస్తున్న ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు శనివారం ఉపాధ్యక్షులు కేఆర్. సురేష్ బాబు, కార్యదర్శి ఎం. ఓబులేష్ లు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ నూతన సభ్యత స్వీకరణలో భాగంగా కే. హర్షవర్ధన్ కొత్తగా సభ్యత్వం స్వీకరించిన సందర్భంగా కొన్ని యూనియన్ లు అసత్య ఆరోపణలు చేస్తున్నాయన్నారు.