మహాత్మా జ్యోతిరావ్ ఫూలే విగ్రహం పునరుద్ధరణ చేయాలని బీసీ సంఘాలు గురువారం కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. ఫూలే విగ్రహాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి సారిగా అనంతపురం జిల్లా కేంద్రం స్థానిక సంగమేష్ సర్కిల్ నందు 2002 సంవత్సరంలో ఏర్పాటు చేశారని రోడ్డు నిర్మాణంలో తొలగించారన్నారు. తిరిగి విగ్రహం ఏర్పాటు చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు నాయకులు కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు.