విద్యార్థుల కోసం.. రోడ్డుపై మున్సిపల్ చైర్మన్ ధర్నా
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి విద్యార్థుల ఫీజుల విషయంలో ఓ ప్రైవేటు కాలేజీ యాజమాన్యంపై అగ్రహం వ్యక్తం చేశారు. అధిక ఫీజు చెల్లించమని ఒత్తిడి చేస్తూ సర్టిఫికెట్లు ఇవ్వడంలేదనే ఫిర్యాదు అందుకోని, విద్యార్థులకు మద్దతుగా నిలబడ్డారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలసి కాలేజీ ఎదుట ధర్నా చేపట్టి, వెంటనే ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేశారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు.