తాడిపత్రి మండలంలో పోలీసులు కార్డెన్ సెర్చ్
తాడిపత్రి మండలంలో పోలీసులు ఆదివారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మండలంలోని సమస్యాత్మక గ్రామమైన వీరాపురం గ్రామంలో జిల్లా ఎస్పీ జగదీష్, డీఎస్పీ రామకృష్ణుడు ఆదేశాల మేరకు సిఐ శివ గంగాధర్ రెడ్డి, ఆయన సిబ్బందితో కలిసి గ్రామంలోని అనుమానితుల ఇండ్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో గ్రామ సభ నిర్వహించి ఘర్షణల జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా జీవించాలని సీఐ శివ గంగాధర్ రెడ్డి సూచించారు.