శింగనమల మండలంలో ఖరీఫ్ సీజన్ పంటలకు ఈ-క్రాప్ నమోదు గడువును ప్రభుత్వం పొడిగించిందని ఏఓ అన్వేష్ కుమార్ సోమవారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వతేదీ వరకు గడువు వుండగా తాజాగా ఈ నెల 30వతేదీ వరకు పొడిగించిందన్నారు. ఈ-క్రాప్ నమోదు చేస్తేనే పంటల బీమా అమలవుతుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. పిఎంఎఫ్ బీవై, వాతావరణ ఆధారిత పంటల బీమాను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.