అనంతపురంలో దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ పోటీలు శనివారం కొనసాగుతున్నాయి. స్థానిక ఆర్డీటీ క్రీడా గ్రామంలోని రెండు మైదానాల్లో ఇవాళ మూడో రోజు ఆట కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో స్థానిక క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి తరలివస్తున్నారు. ఫ్యాన్స్ తో స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. అయితే ఈ మైదానంలో మాత్రమే ప్రేక్షకులు తిలకించేందుకు వీలుంది. బీ గ్రౌండ్లో కూర్చునే వసతులు లేవు.