అనంతపురం వేదికగా శుక్రవారం జరుగుతున్న దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ అట్టహాసంగా కొనసాగుతోంది. ఇండియా ఏ & డీ టీమ్ ల మధ్య పోరు రసవత్తరంగా కొనసాగుతోంది. మొదటి ఇన్నింగ్స్ లో ఏ జట్టు 290 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది. తర్వాత డీ జట్టు 183 రన్స్ కు కుప్పకూలింది. పడిక్కల్ 92 పరుగులతో రాణించారు. డీ జట్టు బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఆకిబ్ ఖాన్ చెరో మూడు వికెట్లు తీశారు. స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది.