యలమంచిలి: ప్రజలు భాగస్వాములు కావాలి
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని యలమంచిలి మున్సిపల్ కమిషనర్ బి. ప్రసాద్ రాజు పిలుపునిచ్చారు. ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ఫైర్ స్టేషన్, అంగన్వాడీ కేంద్రం పరిసర ప్రాంతాల్లో శ్రమదానంతో వ్యర్థాలు, తుప్పలను తొలగించే కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రతతో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.