పది అడుగుల కొండ చిలువ హతం చేసిన గ్రామస్తులు

59பார்த்தது
చోడపల్లి గ్రామంలో కొండచిలువ గ్రామస్థులను భయపెట్టింది. ఆదివారం రాత్రి కొందరు మహిళలు బయట కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో పాము పాకినట్టు శబ్దం రావడాన్ని గుర్తించారు. ఆ సమయంలో స్కూటీపై ఓ వ్యక్తి అక్కడికి రావడంతో ఆ వెలుగులో మహిళల పక్కనే ఉన్న సుమారు పది అడుగుల కొండ చిలువ ముడుచుకుని ఉండడాన్ని చూసి, కేకలు వేశారు. ఎంత అదిరించినా అక్కడి నుంచి కదలకపోవడంతో చేసేది లేక గ్రామస్థులు దానిని హతమార్చారు.

தொடர்புடைய செய்தி