గంజాయి నియంత్రణపై దృష్టి సారించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హాకు ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సూచించారు. శనివారం అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు. నేరాల నియంత్రణలో జిల్లా ప్రథమ స్థానంలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వాతావరణాన్ని ఏర్పాటు చేయాలన్నారు.