ఎస్ రాయవరం: గెడ్డపాలెంలో చోరీ
ఎస్. రాయవరం మండలం గెడ్డపాలెం కర్రి శాంతి కుమార్ ఇంట్లో శుక్రవారం చోరీ జరిగింది. ఈ నెల 9న శాంతి కుమార్ బంధువు ఒకరు చనిపోవడంతో కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్లకుండా బయటే ఉంటున్నారు. శుక్రవారం ఉదయం ఇంటిని శుభ్రం చేయడానికి ఇంట్లోకి వెళ్ళగా చోరీ జరిగినట్టు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేయగా సీఐ రామకృష్ణ, ఎస్సై విభీషణరావులు సంఘటన స్థలాన్నిపరిశీలించి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరించారు.