నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్‌ను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ బుధవారం ప్రారంభించారు. ఈ అన్న క్యాంటిన్ నిర్వహణ బాధ్యతలు హరేరామ హరికృష్ణ సంస్థ చేపట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు నిలిపివేయడంతో స్వంత నిధులతోనే అన్నపూర్ణ అక్షయపాత్ర ఆధ్వర్యంలో చింతకాయల పద్మవతి, రెండు రూపాయలకే అన్న క్యాంటిన్ నిర్వహించారన్నారు.