మాడుగుల.. తగ్గించిన పాల ధరలను వెంటనే పెంచాలి
విశాఖ డెయిరీ తగ్గించిన పాల ధరను వెంటనే పెంచాలని ఈనెల 29 న విశాఖ డెయిరీ వద్ద జరుగు ఉత్తరాంధ్ర పాడిరైతుల సమావేశం జయప్రదం చేయాలని వ్వవ సాయకార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న, సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఇరట నరసింహమూర్తి పిలుపునిచ్చారు. మాడుగుల మండలం వీరారానారాయణం గ్రామంలో ఆదివారం పాలరైతులు ఆందోళన చేసారు. అనంతరం వారు మాట్లాడుతూ డెయిరీ యాజమాన్యం సేకరిస్తున్న పాల ధరలను తగ్గించడం అన్యాయమన్నారు.