ఉత్తరాంధ్రకు వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాబోయే 3 రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం పార్వతీపురం మన్యం, అల్లూరి, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడి చైనాలో బీభత్సం సృష్టిస్తున్న ‘యాగి’ తుఫాన్ కారణంగా ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతోందని వాతావరణ కేంద్రం శనివారం ఉదయం తెలిపింది.