విశాఖ: సమస్యల పరిష్కారానికి ప్రజా పోరాటాలు
సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నవంబర్ 8 నుంచి 14 వరకు జరుగుతున్న ప్రజా పోరు పోస్టర్ ఆవిష్కరణ విశాఖ లోని స్ప్రింగ్ రోడ్ జంక్షన్ లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగదాంబ జోన్ నాయకులు శేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు దాటినప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేర్చుకపోగా ప్రజలపై నిత్యవసర ధరల భారం, ట్రూ అప్ చార్జీల పేరుతో కరెంటు చార్జీల భారం మోపడం దుర్మార్గం అన్నారు.