రాష్ట్రంలో విద్యారంగంలో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 27 నుంచి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మహాసభలు విజయనగరంలో నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి యు. నాగరాజు తెలిపారు. ఈ మేరకు గురువారం విశాఖ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వద్ద గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరికీ విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 30 వరకు సభలు జరుగుతాయన్నారు.