బాణసంచా అమ్మకాలు జరిపే వ్యాపారులు విధిగా నిబంధనలు పాటించాలని పెందుర్తి సిఐ సతీష్ కుమార్ సూచించారు. ఆదివారం మాట్లాడుతూ లైసెన్స్ పొందినవారే షాపులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. షాపులు వద్ద ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. షాప్ కు షాపుకు మధ్య పది అడుగుల దూరం ఉండాలన్నారు. అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.