ఇళ్ల నిర్మాణాల కోసం గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు, పట్టణాలలో రెండు సెంట్లు స్థలాలు కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేసింది. సోమవారం పెందుర్తి మండలం చినముషిడివాడ సచివాలయం వద్ద ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంటి నిర్మాణానికి రూ. ఐదు లక్షలు ఇవ్వాలన్నారు.