గ్రామపంచాయతీలతో పాటు మండల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించుకోవాలని ఈఓపీఆర్డీ ధర్మారావు సూచించారు. పరవాడ మండలానికి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలకు అభివృద్ధి ప్రణాళికపై ఎంపీపీ పైల వెంకట లక్ష్మి అధ్యక్షతన బుధవారం అవగాహన సదస్సును మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025-26 సంవత్సరానికి చేపట్టాల్సిన పనులకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు.