పాయకరావుపేట: చంద్రబాబు శపథం.. వైసిపికి మరణ శాసనం
ఆనాడు అసెంబ్లీలో చంద్రబాబు చేసిన శపథం వైసీపీకి మరణ శాసనం అయిందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం విజయవాడలో పేర్కొన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వైసీపీ సభ్యులు దిగజారుడు వ్యాఖ్యలు చేసి చంద్రబాబును మానసిక వేధనకు గురిచేసి కన్నీరు పెట్టించారన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన శపథం వైసీపీకి మరణ శాసనం అయిందన్నారు. ఈ ఘటన జరిగి సరిగ్గా నేటికీ మూడేళ్లు అయిందన్నారు.