కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నార్నూర్ మండల కేంద్రంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధి జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ప్రధానిగా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ఇందిరా గాంధీ ప్రవేశపెట్టారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దేవరావ్ లోఖండే అన్నారు.