గిరిజన ప్రాంతంలో గిరిజన రైతులు పండిస్తున్న జీడిమామిడి, కాఫీ పంటలను దళారీ వ్యవస్థ నుంచి కాపాడి, గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బోనంగి చిన్నయ్య పడాల్ డిమాండ్ చేశారు. శనివారం సీపీఎం కొయ్యూరు మండల 7వ మహాసభ నిర్వహించారు. కొయ్యూరు మండలంలో సుమారు 30వేల కుటుంబాలు జీడిమామిడి పంటపై ఆధారపడి జీవిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఆవేదన చెందారు.