నర్సీపట్నం పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సిఐ గోవిందరావు కి సూచించారు. మంగళవారం నర్సీపట్నం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలోఆయన మాట్లాడుతూ గంజాయి సరఫరా పై కఠినచర్యలు తీసుకోవాలని, ఈ విషయంలోఎలాంటి రాజీ లేకుండా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అంతకుముందుకొత్తగా వచ్చిన సిఐ స్పీకర్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.