చెరువుల ఆక్రమణలపై చర్యలుకై ఎమ్మెల్యేకి వినతి
ఉత్తరాంధ్ర జల వనరుల పరిరక్షణ యాత్రలో భాగంగా 6వ రోజు గురువారం మాడుగుల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని తాసిల్దారులకు, ఎంపీడీవోలకు చెరువులు, నీటి వనరుల ఆక్రమణలపై చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణని చెరువుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు మరిసర్ల కృష్ణమూర్తి నాయుడు, గౌరవ అధ్యక్షుడు భారతనంద స్వామి, నల్ల బలరాం కలిసి మాడుగుల నియోజవర్గంలో చెరువుల ఆక్రమణలపై చర్యలు చేపట్టాలని కోరారు.