రెవెన్యూపరమైన సమస్యలు, భూ సమస్యలు పరిష్కారానికి గ్రామ గ్రామాన గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు స్థానిక తహసీల్దార్ కే రమాదేవి బుధవారం తెలిపారు. ఈనెల 17 నుంచి వచ్చే నెల 27 వరకు మాడుగుల మండలంలో గల 29 పంచాయతీల్లో 33 గ్రామాల్లో ఈ సభలు నిర్వహించడం జరుగుతాదన్నారు. ఈనెల 17న భాగవతుల అగ్రహారంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. గ్రామ సచివాలయంలో జరిగే ఈ సభకు గ్రామస్తుల హాజరై విజయవంతం చేయాలని కోరారు.