గాజువాక పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. పలు రహదారులపై నీరు భారీగా చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం కాస్త తెరిపించిన వాన ఆదివారం ఉదయం నుంచి మళ్లీ మొదలైంది. డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. అర్హదారులపై మురుగు చేరడంతో స్థానిక ఇబ్బందులు పడుతున్నారు.