వయోవృద్ధుల సంక్షేమమే ప్రధాని మోడీ లక్ష్యమని రాజ్యసభ మాజీ సభ్యులు జివిఎల్ నరసింహారావు తెలిపారు. విశాఖలోని వీఎంఆర్డీఏ బాలల ప్రాంగణంలో 60 ఏళ్లు దాటిని వృద్ధులకు సోమవారం ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 817 మంది వయో శ్రీ లకు 44 లక్షల రూపాయల విలువగల 3083 ఉపకరణములను అందజేశామన్నారు. ప్రధాని మోడీ దివ్యాంగుల , వయో శ్రీ ల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు.