అనంతగిరి: ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

64பார்த்தது
అనంతగిరి: ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
అనంతగిరి ఆశ్రమ బాలికల పాఠశాలలో -1లో గురువారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు కమల మాట్లాడుతూ.. బాలికలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, చదువులో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో తోటి ఉపాధ్యాయులు కోటేశ్వరరావు, రాధిక, అనిత, రాజకుమార్, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி