బీ స్మార్ట్ - డోన్ట్ స్టార్ట్ డ్రగ్స్ వంటి మత్తు పదార్ధాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పిలుపునిచ్చారు. గంజాయి ఇతర మత్తు పదార్ధాల నిర్మూలనే ధ్యేయంగా జిల్లా పోలీసులు మొదలుపెట్టిన “సంకల్పం” కార్యక్రమం బుధవారం అనకాపల్లి డైట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగదారులు, అమ్మేవారి, సరఫరా చేసేవారి వివరాలు తెలపాలన్నారు.