ఆశా వర్కర్ల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, గత ప్రభుత్వంతో జరిగిన చర్చల జిఓలను విడుదల చేయాలని కోరుతూ.. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తలు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఆశాలకు గ్రాడ్యూటి అమలు చేయాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, పనిభారం తగ్గించాలని, పాడైన సెల్ ఫోన్ ల స్థానంలో కొత్త 5జి సెల్ ఫోన్లు ఇవ్వాలని డిమాండ్ చేసారు.