పాఠశాల అవరణంలో పారిశుధ్య పనులు.

ఈరోజు అనగా బుదవారం ఉదయం 10: 30 గంటల సమయంలో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని సౌంళ తండా గ్రామ పంచాయతీ బహుళార్ధసాధక కార్మికులు వెంకన్న మరియు మాన్సింగ్ శనిగకుంట తండా ప్రాథమిక పాఠశాల అవరణంలో విపరీతంగా ఉన్న గడ్డి, చెత్త తొలగించి పాఠశాల ఆవరణం అంతా శుభ్రం చేశారు. పాఠశాల లో ఊడ్చేవారు (స్కావెంజర్) లేని కారణంగా గత కొన్ని రోజులుగా పాఠశాల ఆవరణంలో చాలా గడ్డి మొలిచింది మరియు చెత్త ఎక్కువగా పేరుకుపోయింది. ఇది గమనించిన స్థానిక పంచాయతీ కార్యదర్శి వెంటనే ఆ ప్రాంతం అంతా శుభ్రపరచాల్సిందిగా, పారిశుధ్య సిబ్బందికి సూచించగా వారు వెంటనే స్పందించి పాఠశాల ఆవరణం అంతా శుభ్రం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు విద్యార్థులు గ్రామ పంచాయతీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி