ఉపాధ్యాయుల సమావేశానికి అతిథిగా హాజరైన అఖిల భారత గిరిజన సమాఖ్య నాయకులు

శనివారం ఉదయం 9: 30 గంటలకు నెల్లికుదురు మండలం సౌల్ల తండా గ్రామ పంచాయతీ పరిధిలోని శనిగకుంట తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు యుగేందర్ అధ్యక్షతన జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశానికి అతిథిగా అఖిల భారత గిరిజన సమాఖ్య మహబూబాబాద్ జిల్లా నాయకులు రాజశేఖర్ నాయక్ హాజరయ్యారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యుగేందర్ మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఉపాధ్యాయుడికి కృతజ్ఞతలు తెలిపారు అదే విధంగా తల్లిదండ్రులు సైతం పిల్లలపై దృష్టి పెట్టి వాళ్ళ అభివృద్ధి కోసం ఇంటివద్ద సమయం కేటాయించాలని సూచించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி