మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. కుకీలు, మైతీ తెగల మధ్య వైరంతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. హింసాత్మక ఘటనల్లో ఒకరు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు. ఆందోళన కారులను చెదరగొట్టే క్రమంలో జిరిబామ్ జిల్లాలో భద్రతాదళాలు కాల్పులు జరిపాయి. ఈ పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ అధికారులతో సమావేశం కానున్నారు. హోం మంత్రిత్వ శాఖలోని ఈశాన్య విభాగానికి చెందిన సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు.