తెలంగాణ‌లోని నిరుద్యోగుల‌కు మంత్రి కీల‌క సూచ‌న‌

తెలంగాణ‌లోని నిరుద్యోగుల‌కు మంత్రి దామోదర రాజనర్సింహ కీల‌క సూచ‌న‌లు చేశారు. ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భ‌ర్తీ పార‌ద‌ర్శ‌కంగా జ‌రుగుతుంద‌న్నారు. ఉద్యోగం ఇప్పిస్తామ‌ని చెప్పే మాయగాళ్ల మాటలు నమ్మి మోసపోకండని సూచించారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 11 నెలల్లోనే 7 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేశామని మంత్రి గుర్తు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி